పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని లయన్స్ క్లబ్ చే కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఆదివారం స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో జరిగిన శిబిరానికి 112 మంది కంటి జబ్బులు కలిగిన వారు హాజరైయ్యారు. చెన్నైకి చెందిన శంకర్‌నేత్రాలయ వారిచే చికిత్సలు నిర్వహించారు. 57 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేయగా, 21 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ శివ, క్లబ్ అధ్యక్షుడు మహేంద్రరావు, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: Eye medical camp by Lions Club