October 11, 2026
Explore
వాడవాడల మాజీ మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

వాడవాడల మాజీ మంత్రి పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు

October 11, 2026 | Andhra Pradesh

  • తిరుమలలో పూజలు .
  • అన్నదానాలు.

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ , మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినాన్ని వాడవాడల ఘనంగా నిర్వహించారు. ఆదివారం పేదలకు అన్నదానం చేసి, తిరుమలలో పూజలు చేశారు. పట్టణంలోని బస్టాండ్‌లో మిధున్‌యువసేన అధ్యక్షుడు రాజేష్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా మాజీ ఎంపీ రెడ్డెప్ప , మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అలీమ్‌బాషా, వైఎస్సార్‌సీపి రాష్ట్ర కార్యదర్శులు కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ ఎంపిపి భాస్కర్‌రెడ్డి లు కలసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపి, అన్నదానం నిర్వహించారు.అలాగే వైఎస్సార్‌సీపీ జిల్లా యూత్‌వింగ్‌ కన్వీనర్‌ కొత్తపల్లె చెంగారెడ్డి ఆధ్వర్యంలో కొత్తకోట క్రాస్‌లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని సుగాలిమిట్టలో మండల పార్టీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌ దేవమ్మ, వైఎస్సార్‌సిపి నాయకులు మనోజ్‌కుమార్‌నాయక్‌, రాజునాయక్‌, శంకర్‌నాయక్‌ ల ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి అన్నదానం చేశారు. అలాగే వైఎస్సార్‌సీపీ ఎస్టీ సంఘ అధ్యక్షుడు బాణావత్‌ మునీంద్రనాయక్‌, మధు, దళిత సంఘ నాయకుడు చెన్నరాయుడు, ప్రభాకర్‌నాయక్‌, శివశంకర్‌రెడ్డి, జగదీష్‌నాయక్‌లు కలసి అలిపిరి పాదాల చెంత టెంకాయలు కొట్టి, తిరుమలలో పెద్దిరెడ్డి పేరున పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇర్ఫాన్‌, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్‌ అమ్ము, వైఎస్సార్‌సిపి జిల్లా కార్యదర్శి జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, మురుగప్ప, ఖాదర్‌బాషా, శివకుమార్‌, ప్రశాంత్‌రెడ్డి, సిఆర్‌.లలిత తదితరులు పాల్గొన్నారు.

Tags: Former Minister Peddireddy’s birthday celebrations across various localities.