పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు మిధున్‌యువసేన నేతలు కొత్తపల్లె చెంగారెడ్డి, రాజేష్‌లు తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు బస్టాండులో కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే పట్టణ సమీపంలోని ఎంబిటి రోడ్డులో గల ఏ.కొత్తకోట రోడ్డులో అన్నదాన కార్యక్రమాలు , సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు పెద్దిరెడ్డి అభిమానులు, వైఎస్సార్‌సీపీ అభిమానులు తప్పక హాజరై జయప్రదం చేయాలని కోరారు.
Tags: Former Minister Peddireddy’s birthday celebrations on the 11th.