తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరగనుంది. అధిక మాసం కారణంగా టీటీడీ ఈసారి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు ఈనెల 12 నుండి 20 వరకు వైభవంగా సాగనున్నాయి. దసరా సెలవులుతోపాటు పెరటాసి మాసం ముగింపు కావడంతో భక్తుల రద్దీని దృష్టా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టారు. గతనెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి.
Tags: Srivari Navaratri Brahmotsavams begin tomorrow.