తిరుమల ముచ్చట్లు:
జైపూర్ కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు తిరుమల శ్రీవారికి శనివారం రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు.
వీటిలో రూ.44.35 లక్షలు విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన 147 గ్రాముల బంగారు లాకెట్, రూ.7.20 లక్షలు విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన 27 గ్రాముల మూడు వరుసల ముత్యాల హారాలు ఉన్నాయి.
ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఆభరణాలను అందజేశారు.

Tags: Gold locket and pearl necklace donated to the Lord.