October 10, 2026
Explore
టీటీడీ వైద్యశాలలకు రూ.18 లక్షల విలువైన ఔషధాల విరాళం

టీటీడీ వైద్యశాలలకు రూ.18 లక్షల విలువైన ఔషధాల విరాళం

October 10, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన ఎస్ఎస్కే ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ ప్రొప్రైటర్ జి. శ్రవణ్ కుమార్ రూ.15 లక్షల విలువైన ఔషధాలను, ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తలశిల వెంకటేశ్వరరావు రూ.3 లక్షల విలువైన ఔషధాలను శనివారం విరాళంగా అందించారు.

ఈ మేరకు టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్. నాయుడును కలిసి దాతల తరఫున ఔషధాలను అందజేశారు.

Tags: Donation of medicines worth Rs. 18 lakh to TTD hospitals