అమరావతిముచ్చట్లు:
ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే పిల్లల సంరక్షణ కోసం ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ పథకాన్ని త్వరలోనే సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ₹1,400 విలువైన 14 రకాల వస్తువులతో కూడిన ఈ కిట్ల కోసం ప్రభుత్వం ₹51 కోట్లు ఖర్చు చేస్తోంది. నిన్న ఈ కిట్ల నమూనాలను ఆరోగ్య మంత్రి సత్య కుమార్ పరిశీలించారు. నవజాత శిశువుల తొలి దశలో వెచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ కోసం వీటిని రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు..
Tags; ‘NTR Baby Kit’ in government hospitals