గద్వాల ముచ్చట్లు:
కేసీఆర్ ఘనతతోనే గద్వాల జిల్లా ఏర్పాటు: బాసు హనుమంతు నాయుడు,బీఎస్ కేశవ్
గద్వాల జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 5కే రన్ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ప్రారంభించిన ఈ రన్ పాత బస్టాండ్ నుంచి కృష్ణవేణి చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా వైఎస్సార్ చౌక్ వరకు సాగింది.
ఈ సందర్భంగా హనుమంతు నాయుడు మాట్లాడుతూ.. కేసీఆర్ గద్వాల జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు కలెక్టరేట్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, ఎస్పీ కార్యాలయం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
Tags: BRS 5K Run during Gadwal district decennial celebrations.