October 9, 2026
Explore
దీపావళి టపాసుల విక్రయ లైసెన్సులకు అక్టోబర్ 17లోగా దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

దీపావళి టపాసుల విక్రయ లైసెన్సులకు అక్టోబర్ 17లోగా దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

October 9, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

2026 సంవత్సరంలో దీపావళి పండుగ సందర్భంగా టపాసుల విక్రయాలకు కొత్త తాత్కాలిక లైసెన్సులు పొందాలనుకునే వారు, ఇప్పటికే లైసెన్సులు కలిగి ఉండి రెన్యువల్ చేసుకోవాలనుకునే వారు 2026 అక్టోబర్ 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.

కొత్త లైసెన్సుల కోసం ఫారం AE-5, రెన్యువల్ కోసం ఫారం RE-1లో సంబంధిత సబ్ కలెక్టర్ లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అధికారులు కేటాయించిన ప్రదేశాల్లోనే టపాసుల విక్రయాలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags; Applications for Diwali firecracker sales licenses must be submitted by October 17: Collector