చెన్నై ముచ్చట్లు:
చెన్నైలోని టైడల్ పార్క్ సమీపంలో గురువారం రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో దాదాపు 10 అడుగుల లోతులో భారీ సింక్‌హోల్ ఏర్పడింది.
ఈ మార్గంలో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి ఆ గుంతలో బోల్తా పడింది.
అయితే, కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సమయస్ఫూర్తితో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.
మెట్రో రైలు నిర్మాణ పనుల వల్ల రోడ్డు కుంగిందని తెలుస్తోంది.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు.
Tags; Road suddenly caves in in Chennai; car falls into 10-foot-deep pit.