హిమాచల్ ప్రదేశ్ ముచ్చట్లు:
పెళ్లైన కూతుళ్లకు తండ్రి ఆస్తిలో హక్కు నిరాకరించడం చట్ట విరుద్ధమని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. షిమ్లా జిల్లాలో మూడు తరాలుగా కొనసాగుతున్న భూ వివాదంలో ఓ కుమార్తెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వివాహం అయినంత మాత్రాన వారసత్వ హక్కు కోల్పోదని, కుమారులతో సమానంగా హక్కులు ఉంటాయని పేర్కొంది. కేవలం పరిపాలనా సర్క్యులర్ ఆధారంగా ఆమెకు భూమి హక్కు నిరాకరించడం సరికాదని తెలిపింది. 2023లో ఆమె చేసిన దరఖాస్తును పునఃపరిశీలించి, అర్హత ఉంటే రెండు నెలల్లో భూమికి సంబంధించిన పట్టాను ఆమె పేరుపై జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
Tags: Married daughter has a right to father’s property: High Court’s landmark verdict.