October 9, 2026
Explore
ఈసీకి విశ్రాంత న్యాయమూర్తుల మద్దతు

ఈసీకి విశ్రాంత న్యాయమూర్తుల మద్దతు

October 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఓ వైపు ఎన్నికల సంఘం నిర్ణయాలపై దేశ వ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ.. ఈసీకి మద్దతుగా విశ్రాంత న్యాయమూర్తులు ముందుకొచ్చారు. ఎన్నికల సంఘం, ఇతర వ్యవస్థల ప్రతిష్ఠను దిగజార్చొద్దంటూ 42 మంది విశ్రాంత జడ్జీలు బహిరంగ లేఖ రాశారు. ‘‘మాకు తీవ్ర ఆందోళనగా ఉంది. భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలపై నిరంతర దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల కేంద్రబిందువుగా భారత ఎన్నికల సంఘం నిలిచింది. సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు.. కానీ వాటిని కించపరచకూడదు” అని విశ్రాంత న్యాయమూర్తులు పేర్కొన్నారు.

Tags: Retired judges support the EC.