October 9, 2026
Explore
ఏపీలో వారందరికి నోటీసులు..

ఏపీలో వారందరికి నోటీసులు..

October 9, 2026 | Andhra Pradesh

ఇళ్లు కట్టుకుంటారో లేదో చెప్పాల్సిందే!!

అమరావతిముచ్చట్లు:

ఏపీలో ఇళ్ల స్థలాల సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి ఇళ్లు కట్టుకునేందుకు ఆసక్తి ఉందా లేదా అనేది తెలుసుకోనుంది. వద్దనుకునే వారికి మరోచోట స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించనుంది. ఖాళీగా ఉన్న, లబ్ధిదారులు వద్దనుకున్న స్థలాలను అర్హులకు కేటాయించేలా ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆవాస్ సర్వేలో 2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించారు.

Tags: Notices issued to all of them in AP…