తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20 వరకు జరగనున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె.వి. మురళీకృష్ణ కీలక ప్రాంతాలను పరిశీలించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాపై అధికారులకు సూచనలు చేశారు. అక్టోబర్ 16న గరుడ సేవకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక రద్దీ, ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయనున్నారు.
Tags: Massive arrangements for Srivari Navaratri Brahmotsavams in Tirumala.