పుంగనూరుముచ్చట్లు:
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువులు విక్రయించే విధానంపై గురువారం రైతులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి హరిప్రియ తెలిపారు. మండలంలోని చదళ్ల రైతుసేవా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పుంగనూరుతో పాటు చౌడేపల్లె, సోమల, సదుం మండలాల రైతు సేవా కేంద్రాల అధికారులకు శిక్షణ కల్పించారు. ఎరువుల అమ్మకారల్లో పారదర్శకత, వినియోగం తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ యాప్‌ను తీసుకొచ్చిందని ఆమె తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడి శివకుమార్, ఏవో రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags: Distribution of fertilizers to farmers through FFS app