October 8, 2026
Explore
MEO, హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

MEO, హెడ్‌మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని వినతి

October 8, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు:

గాలివీడు మండలం వెలిగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిని వేధించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ MEO నాగరాజు, హెడ్‌మాస్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ APSJAC, USFI నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.

APSJAC జిల్లా అధ్యక్షుడు గంగరాజు, USFI జిల్లా నాయకుడు గణేష్‌ మాట్లాడుతూ.. విద్యార్థిని తల్లి అక్టోబర్‌ 1న MEOకు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని విద్యార్థిని తల్లిపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని కోరారు.

Tags: Request to take action against MEO and Headmaster