లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలంలోని కాపుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్య నాగరత్న (45)పై భర్త దేరేంగుల నరసింహులు రోకలిబండతో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
Tags: Wife attacked in Lakkireddypalli; dies while undergoing treatment.