కడప ముచ్చట్లు:
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ధనియాల ప్రాసెసింగ్ యూనిట్లపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడి ధనియాలను ప్రొద్దుటూరుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ వాటికి కెమికల్స్ కలిపి పొడిగా చేస్తున్నారు. మండి బజారులోని జ్యోతి ప్రాసెసింగ్ యూనిట్లో ఈ తంతు జరుగుతోందని గుర్తించారు. రూ.1.48 కోట్ల విలువైన ధనియాలు స్వాధీనం చేసుకున్నారు. గాజులపల్లి రమేశ్, వినయ్ పై కేసు నమోదు చేశారు.
Tags; Production of coriander powder using chemicals