March 28, 2026
Explore
న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా విజయ్‌కుమార్‌

న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా విజయ్‌కుమార్‌

March 28, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు న్యాయవాదుల సంఘ ఎన్నికలు శనివారం ఎన్నికల అధికారి మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలు హ్గరాహ్గరీగా జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా ఎం.విజయ్‌కుమార్‌ 71 ఓట్లతో విజయం సాధించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా గురుమూర్తి, కార్యదర్శిగా అరవింద్‌కుమార్‌లు ఎన్నికైయ్యారు. ఎన్నికల అధికారి డిక్లరేషన్లు అందజేశారు. కాగా ట్రేజరర్‌గా ప్రశాంతి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. నూతన కార్యవర్గ ప్రతినిదులను న్యాయవాదులు ఏజిపి సురేష్‌బాబు, వెంకటమునియాదవ్‌, బాలాజికుమార్‌, ఆకుల చెన్నకేశవులు, శివప్పనాయుడు, ప్రశాంత్‌, వీరమోహన్‌రెడ్డి, శ్రీనివాసులు,శైలేంద్రకుమార్‌, హేమంత్‌కుమార్‌, కిషొర్‌, విశ్వనాథరెడ్డి, చంద్రశేఖర్‌, ఎల్‌వి.రమణ, జమీల్‌, రామచంద్రప్ప, గిరి, బెనర్జి, అయూబ్‌ తదితరులు అబినందించారు.

Tags: Vijay Kumar as President of the Lawyers’ Association