మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం చేనేత రంగ పితామహుడు ప్రగడ కోటయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు.
అదనపు ఎస్పీ (పరిపాలన) వెంకటాద్రి కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేనేత కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, ఆప్కో సంస్థ ఏర్పాటులో పోషించిన కీలక పాత్రను కొనియాడారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడిగా ప్రజాసేవలో ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ డి. ఏడుకొండలరెడ్డి, ఆర్ఐ (అడ్మిన్) యు. రంగనాథబాబు, ఆర్ఎస్ఐలు శ్రీనివాస్, రవి, అమరనాథ్‌రెడ్డి తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Tags; Pragada Kotaiah’s birth anniversary celebrated grandly at the police office.