September 20, 2026
Explore
పల్నాడు ఎస్పీగా జగదీశ్ అదహళ్లి

పల్నాడు ఎస్పీగా జగదీశ్ అదహళ్లి

September 20, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

రేకుల షెడ్డు నుంచి ఐపీఎస్ వరకు!

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి జగదీశ్ అదహళ్లి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలోని ఓ సాధారణ చక్కెర కర్మాగార డ్రైవర్ కుమారుడైన జగదీశ్, తీవ్ర పేదరికాన్ని జయించి యూపీఎస్సీలో 440వ ర్యాంకుతో ఐపీఎస్ సాధించారు. కొడుకు ఉన్నతాధికారి అయినా తల్లిదండ్రులు ఇప్పటికీ గ్రామంలోని రేకుల షెడ్డు ఇంట్లోనే నిరాడంబరంగా జీవిస్తున్నారు. గతంలో పాడేరు ఏఎస్పీగా, అల్లూరి జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా, సీఎం సెక్యూరిటీ వింగ్‌లో పనిచేసిన ఆయన రాకతో పల్నాడులో శాంతిభద్రతలు మరింత పటిష్టం కానున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Tags: Jagadeesh Adahalli as Palnadu SP