September 20, 2026
Explore
అందరూ చూస్తూ ఉండగానే….నిమిషాల్లో బూడిద అయిన ట్రావెల్ బస్సు.

అందరూ చూస్తూ ఉండగానే….నిమిషాల్లో బూడిద అయిన ట్రావెల్ బస్సు.

September 20, 2026 | Andhra Pradesh

..అప్రమత్తతతో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సేఫ్

శ్రీకాకుళం ముచ్చట్లు:

నరసన్నపేట మండలం జమ్మూ జంక్షన్‌ వద్ద శనివారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి.

విజయవాడ నుంచి టెక్కలి వెళ్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేయడంతో అందులోని ఆరుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

Tags; In full view of everyone… the travel bus was reduced to ashes in minutes.