March 8, 2026
Explore
ఆటోను ఢీకొన్న బలోరాజీపు

ఆటోను ఢీకొన్న బలోరాజీపు

March 8, 2026 | Andhra Pradesh

  • ముగ్గురికి తీవ్ర గాయాలు

పుంగనూరుముచ్చట్లు:

అతివేగంగా వస్తు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి భీమగానిపల్లె వద్ద గల శ్రీకృష్ణదేవరాయ సర్కిల్‌లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు చెందిన రంజిత్‌(30), ప్రసాద్‌ (35), సూర్య (28) లు ఆటోలో బయలుదేరి మదనపల్లెలో జరుగుతున్న కనుమ గంగమ్మ జాతరకు వెళ్తూ మార్గ మద్యంలో పుంగనూరు వద్దకు రాగానే ఎదురుగా మదనపల్లె నుంచి కర్నాటకాకు టమోటాలు తీసుకుని వెళ్తున్న బలోరాజీపు అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర రక్త గాయాలై, ప్రసాద్‌, సూర్యకు కాళ్లు విరిగింది. సంఘటనను గమనించిన స్థానికులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Balorajipu collided with an auto