September 18, 2026
Explore
మెప్మా పీడీగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు..

మెప్మా పీడీగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు..

September 18, 2026 | Andhra Pradesh

పల్నాడు జిల్లా ముచ్చట్లు:

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లనుమర్యాదపూర్వకంగా కలిశారు..

పల్నాడు జిల్లా మెప్మా (MEPMA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు, ఈ రోజు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు తనకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.జిల్లాలో మెప్మా కార్యక్రమాల అమలు,పట్టణ పేదరిక నిర్మూలన,స్వయం సహాయక సంఘాల మహిళల సాధికారత తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది.జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,మెప్మా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

Tags: Venkateswarlu assumed charge as MEPMA PD.