అన్నమయ్య ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజా భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ, పోక్సో చట్టం, సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కమిటీలకు సూచనలు చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం ఉండేలా భరోసా కల్పిస్తున్నారు. నేర రహిత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
Tags: Police conduct extensive public awareness campaign on public safety.