మదనపల్లెముచ్చట్లు:
మదనపల్లి మున్సిపాలిటీ కౌంటింగ్ ప్రక్రియలో కీలక దశకు చేరుకుంది.పోలైన బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలు కట్టే ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు వార్డుల వారీగా లెక్కింపు ప్రారంభించారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలోని మూడు కౌంటింగ్ హాళ్లలో 72 టేబుళ్లపై ఏకకాలంలో లెక్కింపు సాగుతోంది. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో వార్డు కౌన్సిలర్ల ఓట్లను లెక్కిస్తున్నారు. ప్రతి రౌండ్ ఫలితాన్ని అధికారులు ప్రకటించనున్నారు. భద్రత మధ్య ప్రశాంతంగా కౌంటింగ్ జరుగుతోంది.
Tags: Counting for the wards has begun