September 17, 2026
Explore
25 నుంచి కొత్త జిల్లాల్లో జడ్పీ కార్యాలయాలు

25 నుంచి కొత్త జిల్లాల్లో జడ్పీ కార్యాలయాలు

September 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడానికి సన్నాహాలు.

కొత్త జిల్లాల్లో ఈ నెల 25 నుంచి జిల్లా పరిషత్ కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. 24తో ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం వెంటనే 15 కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జడ్పీలకు తాత్కాలికంగా భవనాలు సమకూర్చడం, సిబ్బంది విభజన తదితర ఏర్పాట్ల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొత్త జిల్లాల్లోనూ జడ్పీల ఏర్పాటుకు ఇటీవల ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్తగా 15 జడ్పీ సీఈవో, మరో 15 డిప్యూటీ సీఈవోల పోస్టులు ప్రభుత్వం మంజూరు చేయడంతో అర్హులైన అధికారులకు పదోన్నతులు కల్పించనున్నారు. పాత జిల్లా పరిషత్ కార్యాలయాల్లో సిబ్బందిని విభజించి కొత్త జిల్లా లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags: ZP offices in new districts from the 25th