March 27, 2026
Explore
బాలాజీ గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారుల ఆందోళన

బాలాజీ గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారుల ఆందోళన

March 27, 2026 | Andhra Pradesh

తాడేపల్లి ముచ్చట్లు:

డెలివరీ ఆటోలను కంపెనీ నుంచి బైటకు వెళ్లకుండా అడ్డుకున్న మహిళలు..

20 రోజుల క్రితం బుక్ చేసుకొని ఓటిపి లు వచ్చినా… ఇంతవరకు గ్యాస్ సిలిండర్ లు డెలివరీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు…

సిలిండర్ కోసం కంపెనీ కి వస్తే…ఇక్కడికి వచ్చిన వారిని వదిలేసి…బైటకు ఎలా సిలిండర్ లు పంపిస్తారని కంపెనీ ప్రతినిధులను నిలదీసిన వినియోగదారులు…

బైట డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ను రూ.2 వేల నుండి రూ.3 వేల వరకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్న మహిళలు…

అవే ప్రయాసలు… తీరని గ్యాస్ కష్టాలు

తాడేపల్లి బాలాజీ గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారుల పాట్లు

వంట గ్యాస్ కొరత లేదు…సిలిండర్ బుక్ చేసిన రెండు…మూడు రోజుల్లో మీకు ఇంటికి డెలివరీ చేస్తారు…ఇలా అధికారులు చెప్తున్న మాటలు కార్యరూపం దాల్చట్లేదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని ఓటిపి వచ్చి, 15 నుండి 20 రోజులు గడిచినా ఇంతవరకు డెలివరీ రాలేదని, ఎక్కువ మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను తీసుకొని ఉదయం 7 గంటలకు వచ్చి,సిలిండర్ లైన్ లో పెట్టి రోజంతా నిలువు కాళ్ళ మీద నుంచున్నామని మహిళలు వాపోతున్నారు. వందమందికి పైగా సిలిండర్లు కోసం ఎదురు చూస్తున్నామని,మా పరిస్థితి ఏంటని,కంపెనీ సిబ్బందితో పలువురు వాగ్వాదమాడారు.పనులు మానుకొని సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని, రోజువారీ పనులు చేసుకొనే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకొని, తమ గ్యాస్ కష్టాలు తీర్చాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Tags: Customer Protest at Balaji Gas Company