విశాఖపట్నంముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది..
ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని కన్నుమూశారు.
విశాఖపట్నంలో గుండె పోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం
ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఆళ్ల నాని.. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి.. వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Tags: Former Deputy CM Alla Nani passes away.