కాణిపాకం ముచ్చట్లు:
కాణిపాకం వినాయక స్వామిని సత్యప్రమాణాల దేవుడు అంటాడు. ఒక బావిలో లభించిన ఈ వినాయకుని విగ్రహం పరిమాణం అంతకంతకూ పెరుగుతోంది. వినాయక చవితికి కాణిపాకంలో గ్రామోత్సవం జరుగుతుంది.
మరునాటినుంచి అంగరంగవైభోగంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా వాహన సేవలు, కల్యాణోత్సవం, రథోత్సవం నిర్వహిస్తారు. కాణిపాకం వినాయక స్వామి భక్తులకు ఇవి
మహోత్సవాలు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని విశ్వాసం. తాగుడు, జూదం వంటి వ్యసనాలకు బానిసలైన వారు స్వామి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీవరసిద్ధి వినాయకుని ఆలయం ఉంది. బహుదా నది ఒడ్డున కాణిపాక వినాయకుడు సర్వమత ఆరాధ్యుడుగా పూజలందుకుంటున్నాడు.
Tags: Kanipakam Sri Varasiddhi Vinayaka Brahmotsavams Begin