September 15, 2026
Explore
ప్రకృతి ఒడిలో వెలిసిన దక్షిణముఖ వినాయకుడు

ప్రకృతి ఒడిలో వెలిసిన దక్షిణముఖ వినాయకుడు

September 15, 2026 | Uncategorized

సుండుపల్లె ముచ్చట్లు:

సుండుపల్లె మండలం కొత్త వడ్డెపల్లె సమీపంలోని పెండ్లిగుండ్లలో సహజ రాతి రూపంలో వెలసిన దక్షిణముఖ వినాయకుడికి వినాయక చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సుండుపల్లె, దుద్యాల, శిభ్యాల తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వినాయకుడిని పూలమాలలు, గరికతో అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. జిల్లేడు పూలతో తయారు చేసిన హారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రకృతి మధ్యలో సహజసిద్ధంగా వెలసిన ఈ దక్షిణముఖ వినాయకుడు ఆధ్యాత్మికంగా, ప్రకృతి సౌందర్యపరంగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

Tags: A south-facing Vinayaka enshrined in the lap of nature.