September 13, 2026
Explore
సెల్ఫోన్ రిపేర్ కోసం వెళ్లిన యువతి

సెల్ఫోన్ రిపేర్ కోసం వెళ్లిన యువతి

September 13, 2026 | Andhra Pradesh

.. ఊహించని ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు..

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఫోన్ రిపేర్ చేయించుకుని గంటలో వచ్చేస్తా.. అని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని వెళ్లిన ఆ యువతి.. ఊహించని ప్రమాదంలో మృత్యుఒడికి చేరుకుంది. హైదరాబాద్ అమీర్పేటలో ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బంజారాహిల్స్ నుంచి అమీర్పేటకు ర్యాపిడోపై వెళ్తుండగా అసలేం జరిగింది? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హైదరాబాద్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆఫీసులో కాసేపు పర్మిషన్ తీసుకుని సెల్‌ఫోన్ బాగు చేయించుకునేందుకు బయటకు వెళ్లిన ఓ యువతిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన హేమదుర్గ (26) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చింది. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో బస చేస్తూ, బంజారాహిల్స్‌లోని ప్రముఖ కార్ల షోరూమ్‌లో ఉద్యోగం చేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా రోజూలాగే ఆఫీసుకు వచ్చిన ఆమె.. తన మొబైల్ ఫోన్ పాడవడంతో దాన్ని రిపేర్ చేయించుకోవాలని భావించింది.

క్షణాల్లో ముంచుకొచ్చిన మృత్యువు

సెల్ఫోన్ బాగు చేయించుకుని త్వరగానే తిరిగి వచ్చేస్తానని ఆఫీసులో పర్మిషన్ తీసుకున్న హేమదుర్గ.. అమీర్పేట వెళ్లేందుకు ర్యాపిడో బైక్ను బుక్ చేసుకుంది. ఆ బైక్పై అమీర్పేట బిగ్బజార్ వెనుక గేట్ సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హేమదుర్గ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కూడా ఈ ఘటనలో గాయపడ్డాడు.

Tags: A young woman who went for a cellphone repair.