September 12, 2026
Explore
లక్కిరెడ్డిపల్లి లో నేడు జాతీయ లోక్‌ అదాలత్

లక్కిరెడ్డిపల్లి లో నేడు జాతీయ లోక్‌ అదాలత్

September 12, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ భరత్‌ కమల్‌, లీగల్‌ సర్వీస్‌ సభ్యుడు ఎంఎల్‌ రామచంద్రారెడ్డి పాల్గొని, రాజీ కుదిరే సివిల్‌, క్రిమినల్‌ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్‌ అదాలత్‌ ద్వారా సమయం, నగదు ఆదా అవుతాయని, ‘రాజీ మార్గమే రాచమార్గం’ అని పేర్కొన్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Tags: National Lok Adalat in Lakkireddypalli today