నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు రూరల్ లోని నాలుగో మైలు అశోక్ నగర్ వద్ద యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు నాలుగో మైల్లోని అంబేద్కర్ నగర్ వద్ద చెన్నయ్య,బుజ్జమ్మ ల కుమారుడు చందు (20) దారుణ హత్యకు గురయ్యాడు. మూడు నెలల క్రితం మెకానిక్ పని నేర్చుకునేందుకు చెన్నైకి వెళ్లి మెకానిక్ పని నేర్చుకున్నాడు. ఈనెల రెండవ తేదీ తిరిగి నెల్లూరుకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు బయలుదేరిన చందు శనివారం ఉదయం శవమై తేలాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Brutal murder in Nellore