September 12, 2026
Explore
మద్యం దుకాణాల లైసెన్సులు రెన్యువల్ చేసుకోండి

మద్యం దుకాణాల లైసెన్సులు రెన్యువల్ చేసుకోండి

September 12, 2026 | Andhra Pradesh

మదనపల్లెముచ్చట్లు:

లైసెన్సులు రెన్యువల్ చేసుకోకుంటే రద్దు చేస్తాం: ఎక్సైజ్ డీసీ జయరాజ్

మద్యం దుకాణాల లైసెన్సులను సకాలంలో రెన్యువల్ చేసుకోకుంటే రద్దు చేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ హెచ్చరించారు. శుక్రవారం మదనపల్లె ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో మదనపల్లె, ములకలచెరువు, వాల్మీకిపురం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాల లైసెన్సుదారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అదనపు ఫీజు చెల్లించి ఏడాది కాలానికి లైసెన్సులను పునరుద్ధరించుకోవాలని సూచించారు.

మద్యం ఎమ్మార్పీకే విక్రయించాలని, బాటిల్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి విక్రయాలు జరపాలని ఆదేశించారు. ప్రతి దుకాణాన్ని ఏపీ విధానంలో అనుసంధానం చేసి పర్యవేక్షిస్తామని, నిర్ణీత సమయపాలన తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సీఐలు భీమలింగ, మురళీకిశోర్, లత తదితరులు పాల్గొన్నారు.

Tags: Renew your liquor shop licenses.