September 12, 2026
Explore
నేడు జాతీయ లోక్‌అదాలత్

నేడు జాతీయ లోక్‌అదాలత్

September 12, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

మదనపల్లె కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏడీజే పీవీఎస్ సూర్యనారాయణమూర్తి తెలిపారు. రాజీ కుదిరే అన్ని రకాల కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకుని ప్రజలు ప్రయోజనం పొందాలని సూచించారు. దీంతో సమయం, నగదు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ‘రాజీ మార్గమే రాచమార్గం’ అని, లోక్‌అదాలత్ తీర్పే అంతిమ తీర్పు అని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి పిలుపునిచ్చారు.

Tags: National Lok Adalat today