బి.కొత్తకోట ముచ్చట్లు:
మరో యువకుడికి స్వల్ప గాయాలు.. బెంగళూరుకు రెఫర్
బి.కొత్తకోట మండలంలో శనివారం ఉదయం ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ యువకుడి కాలు తీవ్రంగా దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు.
నాయినబావి పంచాయతీ కాయలవారిపల్లికి చెందిన రాజేంద్ర (23), హరికృష్ణ (28)లు బైక్‌పై కురబలకోట మండలం అంగళ్లు గొర్రెల సంతకు బయలుదేరారు. మార్గమధ్యంలోని నాయినబావి కోళ్ల ఫారం వద్దకు చేరుకోగానే పొలం నుంచి ప్రధాన రోడ్డుపైకి వస్తున్న ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ కాలు తీవ్రంగా గాయపడగా, రాజేంద్రకు స్వల్ప గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించిన అనంతరం హరికృష్ణను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రెఫర్ చేశారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Youth sustains severe injuries after being hit by a tractor.