పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని కోర్టు ఆవరణంలో శనివారం మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. న్యాయమూర్తులు పరేష్‌కుమార్, కృష్ణవంశితో కలసి సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామన్నారు. లోక్‌అదాలత్‌లో పరిష్కరింపబడే కేసులన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. న్యాయవాదులు, అన్నిశాఖల అధికారులు, కక్షిదారులు కలసి అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమైయ్యేలా చూడాలన్నారు.
Tags: Mega Lok Adalat on the 12th