పల్నాడు ముచ్చట్లు:
సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ అనుమతుల ప్రక్రియ ప్రారంభం..
పల్నాడు జిల్లాలో వినాయక చవితి వేడుకల నేపథ్యంలో మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి తప్పనిసరని జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టంచేశారు.అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ ఆన్‌లైన్ సింగిల్ విండో విధానంనుఅందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.ఈ వ్యవస్థ ద్వారా పోలీస్, ఫైర్, మున్సిపల్/పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అనుమతులను ఒకే చోట, పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
దరఖాస్తు విధానం.
నిర్వాహకులు https://ganeshutsav.net/ పోర్టల్‌లో మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఆధార్, స్థల వివరాలు, మండప పరిమాణం, నిమజ్జన తేదీ-మార్గం తదితర వివరాలతో పాటు అవసరమైన పత్రాలను జతపరచాలి. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరంఅనుమతులు మంజూరు కానున్నాయి.అనంతరం QR కోడ్‌తో కూడిన డిజిటల్ NOC ను డౌన్‌లోడ్ చేసుకుని మండపం వద్ద కనబడే విధంగా ఉంచాలి.
భద్రతా నిబంధనలు..
· మండపాలు అత్యవసర సేవలకు ఆటంకం కలిగించకూడదు
· తగిన వెలుతురు, అగ్నిమాపక పరికరాలు, పారిశుధ్యం,సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి
· రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు/లౌడ్‌స్పీకర్లు వాడరాదు
· పోలీస్ సూచించిన మార్గాలు, సమయాలను మాత్రమే పాటించాలి
నిమజ్జన నిబంధనలు..
· అధికారికంగా గుర్తించిన ప్రాంతాల్లో మాత్రమే నిమజ్జనం
· నదులు, కాలువలు, చెరువులు, తాగునీటి వనరుల్లో అనధికార నిమజ్జనం నిషేధం
· నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు, లైఫ్ జాకెట్లు, రక్షణ పడవలు, అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి
హెచ్చరిక…
శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అనధికార మార్గాల్లో ఊరేగింపులు నిర్వహించినా, శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించినా చట్టప్రకారం కఠిన చర్యలుతీసుకుంటామని అదనపు ఎస్పీ హెచ్చరించారు.
పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా మట్టి విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యమివ్వాలని, ప్రజలందరూనియమాలు పాటిస్తూవేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.
Tags: Prior permission is mandatory for Vinayaka pandals.