తిరుపతి ముచ్చట్లు:
తిరుపతికి చేరుకున్న రిలయన్స్ ఎలక్ట్రిక్ ధర్మరథ బస్సులు శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రయాణాన్ని అందించనున్నాయి.
శ్రీవారి సేవలో భాగంగా అనంత్ అంబానీ గారు టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు డ్రైవర్ల జీతభత్యాలను భరించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయం. భక్తుల సౌకర్యార్థం అందిస్తున్న ఈ సేవా కార్యక్రమం ప్రశంసనీయం.
ఈ బస్సులను రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ, తిరుమల ఆధ్యాత్మిక వైభవం మరింతగా విరాజిల్లాలని కోరుకుంటున్నాను.
Tags: Reliance Electric ‘Dharmaratha’ buses arrive in Tirupati.