పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని 31వ వార్డులలోను పెన్షన్ల కోసం వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తదితరులు క్యూ కట్టారు. మున్సిపాలిటిలో ధరఖాస్తులు కోరుతూ ఈనెల 7 నుంచి ప్రభుత్వం సచివాలయాలలో స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. 16 వరకు ధరఖాస్తులు తీసుకోవాల్సి ఉంది. బుధవారానికి 687 ధరఖాస్తులు అందాయి. వీటిలో 323 ధరఖాస్తులు వితంతువులు ఉన్నారు. ఈనెల ఆఖరు వరకు పరిశీలన, బడ్జెట్ ప్రతిపాదనలు నిర్వహించి, ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం చేపడుతామని ప్రకటించింది. గత రెండేళ్లుగా పెన్షన్లు లేకుండ అలమటించిన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రకటనతో ఆశలు చిగురించింది. వీటిలో ఏఏ నింబంధనలు పెడతారో…ధరఖాస్తు చేసుకున్న వారందరికి పెన్షన్లు మంజూరు చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Tags: 687 applications for pensions