September 9, 2026
Explore
గణేష్‌ ఉత్సవాలకు సింగిల్‌విండోలో అనుమతి

గణేష్‌ ఉత్సవాలకు సింగిల్‌విండోలో అనుమతి

September 9, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

గణేష్‌ ఉత్సవాలు నిర్వహించే వారు ముందుగా ఆన్‌లైన్‌లో సింగిల్‌విండో విధానంలో అనుమతికి ధరఖాస్తు చేసుకోవాలని సీఐ సుబ్బరాయుడు బుధవారం తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకుల ధరఖాస్తులను అన్నిశాఖల అధికారులు సింగిల్‌విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, ఇతరత్రా ప్రమాదాలు జరగకుండ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రమాదాలు, అల్లర్లు జరిగితే వాటికి నిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధరఖాస్తు దారులు ఆన్‌లైన్‌లో తక్షణమే నమోదు చేసుకోవాలని కోరారు.

Tags: Single-window clearance for Ganesh festivities