పుంగనూరుముచ్చట్లు:
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పట్టణంలో గణేష్ విగ్రహాల ఏర్పాటు కార్యక్రమాన్ని యువత చురుగ్గా చేపట్టారు. ఎన్‌ఎస్.పేటలోని మల్లారమ్మవీధిలో గల యువకులు అతిపెద్ద మట్టి విగ్రహాన్ని తయారు చేసి రంగులు వేసే కార్యక్రమం చేపట్టారు. అలాగే తేరువీధి, తూర్పు మొగసాల, బజారువీధి, బస్టాండ్, కొత్తయిండ్లు, కొత్తపేట ప్రాంతాలలో కూడ వినాయక విగ్రహాల ఏర్పాటుకు మండపాలు, విద్యుత్‌దీపాలు ఏర్పాట్లలో ఆయా ప్రాంత వాసులు నిమగ్నమైయ్యారు. ఈనెల 14 నుంచి 10 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
Tags: Installation of Ganesha idols