పుంగనూరుముచ్చట్లు:
మండలంలోని గూడూరుపల్లె పాఠశాలలో చదువున్న దివ్యాంగ విద్యార్థి గౌతమ్ జాతీయ పారాస్పోర్టస్మీట్ శిక్షణకు ఎంపిక కావడం ఎంతో అదృష్టమని హెచ్‌ఎం మహేష్‌నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 400 మీటర్ల రన్నింగ్‌రేష్ లో ప్రథమస్థానంలో నిలిచాడని, ఏలూరులో 60 రోజుల శిక్షణ అనంతరం జాతీయస్థాయి పోటీలలో శిక్షణ పొందేందుకు గౌతమ్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈవోలు నటరాజారెడ్డి, రెడ్డెన్నశెట్టిలు దివ్యాంగ విద్యార్థి గౌతమ్‌ను అభినందించారు. శిక్షణలో అత్యంత ప్రతిభ కనబరచి , దేశానికి ఖ్యాతి తీసుకురావాలని కోరారు.
Tags: Differently-abled student Gautam heads to the National Para-Sports Meet.