అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 19 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రిలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో పాటు కేసుల ప్రాథమిక దర్యాప్తు అధికారాలు వస్తాయని తెలిపారు.
దీంతో సిబ్బందిపై బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పదోన్నతి పొందిన సిబ్బందికి సూచించారు.
పదోన్నతి పొందిన సిబ్బందికి అధికారులు అభినందనలు తెలిపారు.
Tags: 19 personnel promoted to Head Constables