September 9, 2026
Explore
శ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మిధున్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మిధున్ రెడ్డి

September 9, 2026 | Andhra Pradesh

శ్రీ సత్యసాయి జిల్లా ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి.వి. మిధున్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ పి.వి. మిధున్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ , ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి , హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రమేష్ కుమార్ రెడ్డి , పుట్టపర్తి మాజీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి , రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి , హిందూపురం సమన్వయకర్త దీపిక , కదిరి సమన్వయకర్త మక్బూల్ బాషా , మడకశిర సమన్వయకర్త ఈర లక్కప్ప , జిల్లా స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు.

సమావేశంలో ప్రధానంగా:

  • జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహకాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
  • ప్రజా సమస్యలపై పోరాటం: క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
  • కార్యకర్తలకు దిశానిర్దేశం: రాబోయే రాజకీయ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:Mithun Reddy participated in the Sri Sathya Sai district-level meeting.