March 8, 2026
Explore
డ్రోన్‌ కెమెరాల నిఘాలో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహణ

డ్రోన్‌ కెమెరాల నిఘాలో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర నిర్వహణ

March 8, 2026 | Andhra Pradesh

-ట్రాఫిక్‌ మళ్లింపు
-దొంగతనాలు జరగకుండ నిఘా

  • ప్రత్యేక ఐడి పార్టీలు ఏర్పాటు

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరులో ఈనెల 10, 11 తేదీలలో జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు పటిష్టమైన ఏర్పాట్లు చేసి, డ్రోన్‌ కెమెరాలు ,ప్రత్యేక ఐడి పార్టీల నిఘాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ జాతర నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్‌కునుబిలి తెలిపారు. ఆదివారం ఆయన సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ అన్సర్‌బాషాతో కలసి ప్యాలెస్‌ ఆవరణంలో జాతర నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. ప్యాలెస్‌ ఆవరణంలో అమ్మవారికి పూజలు నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి జమీందారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పట్టణంలో రెండు రోజుల పాటు ఉదయం 7 నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తామన్నారు. మహిళలకు , బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ముందుజాగ్రత్తగా పోలీస్‌ బృందాలను జాతరలో నియమించామన్నారు. అలాగే దొంగతనాలు జరగకుండ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. విఐపిలకు, భక్తులకు అసౌకర్యాలు కలగకుండ చర్యలు తీసుకున్నామన్నారు. పట్టణాన్ని పూర్తిగా డ్రోన్‌ కెమెరాల నిఘాలో ఉంచామన్నారు. సీసీ కెమెరాలలో పర్యవేక్షిస్తూ జాతరలో ఎలాంటి అవాంచనీయన సంఘటనలు జరగకుండ నిర్వహిస్తామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు ఆవేశాలకు లోనుకాకుండ జాతరను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, పోలీసులకు, అన్నిశాఖల అధికారులకు సహకరించాలని కోరారు.

Tags: Sri Sugutur Gangamma Jatara being held under surveillance of drone cameras