మదనపల్లె ముచ్చట్లు:
రోడ్డు ప్రమాదంలో బైరెడ్డిపల్లె ఎంఈవో జనార్దన్‌రెడ్డి (50) తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటికి చెందిన జనార్దన్‌రెడ్డి బైరెడ్డిపల్లె ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్నారు.
శుక్రవారం స్వగ్రామం నుంచి కారులో బైరెడ్డిపల్లెకు బయలుదేరిన ఆయన.. మదనపల్లె మండలం 150వ మైలు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వ్యాను కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమవగా, జనార్దన్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే ఆయనను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags: MEO sustains severe injuries in road accident.