అమరావతిముచ్చట్లు:
💠అర్హులందరికీ దశలవారీగా ఇద్దాం
💠స్థానిక ఎన్నికల వాయిదా ప్రసక్తే లేదు
💠మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో లోకేశ్
💠అన్ని కేటగిరీల వారి నుంచి పింఛను దరఖాస్తులు
💠రెండు, మూడు రోజుల్లో స్వీకరణ ప్రారంభం
కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెండు, మూడు రోజుల్లో ప్రారంభించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అన్ని కేటగిరీల పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏయే కేటగిరీల పింఛన్లకు దరఖాస్తుల్ని ఎలా తీసుకోవాలనే దానిపై గురువారం రాత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ అధికారులు చర్చించారు. అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. శుక్రవారం సీఎం చంద్రబాబు దృష్టికి దీన్ని తీసుకెళ్లి ఆయన ఆమోదంతో ముందుకు వెళ్లనున్నారు. పింఛను దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా అందరికీ ఒకేసారి ఇవ్వాలా, లేదా దశల వారీగా ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
Tags: New pensions from October