September 4, 2026
Explore
సినిమా స్టైల్లో ఎర్రచందనం స్మగ్లర్ల పరార్‌

సినిమా స్టైల్లో ఎర్రచందనం స్మగ్లర్ల పరార్‌

September 4, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

10 దుంగలు, 2 కార్లు సీజ్‌.. రూ.10 లక్షల విలువ

అన్నమయ్య జిల్లా పీలేరులో ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ శాఖ సంచార దళం మెరుపుదాడి చేసింది. పక్కా సమాచారంతో చిత్తూరు రోడ్డులోని ఎంఆర్‌జేఆర్‌ కళాశాల సమీపంలో ఓ కారును అడ్డగించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుంది.

ఇదే సమయంలో మరో కారును అధికారులు వెంబడించగా.. స్మగ్లర్లు సినిమా ఛేజింగ్‌ సీన్‌ను తలపించేలా వాహనాన్ని వేగంగా నడిపి తప్పించుకునేందుకు యత్నించారు. అయితే పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్‌ వద్ద కారు టైరు పేలిపోవడంతో వాహనాన్ని అక్కడే వదిలి అడవిలోకి పరారయ్యారు.

రెండు వేర్వేరు ఆపరేషన్లలో 10 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్‌ఓ వేణు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Tags: Red sandalwood smugglers escape in movie style